Undiporaadhey Song Lyrics in Telugu
ఉండిపోరాడే గుండె నీదేలే
హత్తుకోరాదే గుండెకే నన్నే
అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నది
మళ్ళీ మళ్ళీ గాల్లో మేఘమై తేలుతున్నది
అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే
మోమాటాలే వద్దన్నాయే అడగాలంటే కౌగిలే
ఉండిపోరాడే గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే
నిశిలో శశిలా నిన్నే చూసాక మనసే మురిసే ఎగసే అలలాగ
ఏదో మైకంలో నేనే ఉన్నాలే నాలో నేనంటు లేనులే
మండే ఎండల్లో వెండి వెన్నెలనే ముందే నేనెప్పుడూ చూడలే
చీకట్లో కూడా నీడలా నీవెంటే నేను ఉండగా
వేరే జన్మంటు నాకే ఎందుకులే నీతో ఈ నిమిషం చాలు
అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే
మోమాటాలే వద్దన్నాయే అడగాలంటే కౌగిలే
ఉండిపోరాడే గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే
Check also Manasuna Edho Raagam Song Lyrics in Telugu